Abdul Nazeer: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Abdul Nazeer: రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం

Shekhar G
Published on: 22 Oct 2023 3:18 PM IST
AP Governor Abdul Nazeer Visited Tirumala Srivara
X

Abdul Nazeer: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 

Abdul Nazeer: తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ భూమన ,ఈవో ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటాన్ని,తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Shekhar G

Shekhar G

Next Story