Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

*ఈ రోజు అసెంబ్లీలో మరో కీలక ప్రకటన *శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం

Shilpa
Updated on: 23 Nov 2021 10:57 AM IST
AP Government will Withdraw the Resolution Dissolving the Legislature in AP Assembly Today 23 11 2021
X

 ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం(ఫోటో - ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ఈ రోజు అసెంబ్లీలో మరో కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉపసంహరణ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. మరోవైపు ఇవాళ మండలి ముందుకు మూడు రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లు రానుంది. చట్ట ఉపసంహరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు.

Shilpa

Shilpa

Next Story