CM Jagan: ప్రభుత్వ స్కూళ్లల్లోని టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్ బొనాంజా

AP Government to Give Money Reward to Tenth  Toppers
x

CM Jagan: ప్రభుత్వ స్కూళ్లల్లోని టెన్త్‌ టాపర్లకు సీఎం జగన్ బొనాంజా

Highlights

CM Jagan: నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బహుమతులు

CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయనడానికి ప్రభుత్వం టెన్త్, ఇంటర్ విద్యార్థులను సత్కరించడమే నిదర్శనం... ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతో... ప్రతిభను ప్రోత్సహించేందుకే ఏపీ ప్రభుత్వం మెరిట్‌ అవార్డులు అందజేస్తోంది.

నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరిస్తారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్‌లో 2 వేల 831 మంది విద్యార్థులను సత్కరింస్తారు.

విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్‌ సంకల్పం... అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అధునాతన వసతులు, డిజిటల్‌ విద్యా బోధన తదితరాలను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకు అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తారు.

ఈనెల 23న సత్కార వేడుక నిర్వహించి... నియోజకవర్గ స్థాయిలో మొదటి బహుమతిగా 15 వేలు, రెండో బహుమతిగా 10 వేలు, మూడో బహుమతిగా 5 వేలు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం... మే 27న జిల్లా స్థాయి సత్కారంలో మొదటి బహుమతిగా 50 వేలు, రెండో బహుమతిగా 30 వేలు, మూడో బహుమతిగా 10 వేల నగదు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా లక్ష, 75 వేలు, 50 వేల చొప్పున నగదు పురస్కారాలతో సత్కరిస్తారు. ఈనెల 31న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పతకం, సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈనెల 31న జరుగనున్న కార్యక్రమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories