AP SSC Textbooks: అమరావతి పాఠ్యాంశాన్ని తొలగిస్తూ కొత్త పుస్తకాల ముద్రణ

AP SSC Textbooks 2021: కొత్తగా ముద్రించిన పుస్తకాలను స్కూళ్లకు సరఫరా చేసిన విద్యాశాఖ

Shireesha
Updated on: 6 Oct 2021 1:45 PM IST
AP Government Removed Amaravati Lesson From SSC Telugu Textbook | Telugu Online News
X

AP SSC Textbooks: అమరావతి పాఠ్యాంశాన్ని తొలగిస్తూ కొత్త పుస్తకాల ముద్రణ 

AP SSC Textbooks 2021: పదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్‌ నుంచి ఓ పాఠ్యాంశం తొలగించింది ఏపీ విద్యాశాఖ. 'అమరావతి' పాఠ్యాంశాన్ని తొలగించి, కొత్త పుస్తకాలను ముద్రించింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రణ జరిగింది. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద అమరావతి పాఠ్యాంశాన్ని అప్పటి ప్రభుత్వం చేర్చింది.

అయితే.. ఇప్పుడు.. 'అమరావతి' పాఠ్యాంశాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలను ముద్రించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే.. కొత్తగా ముద్రించిన పుస్తకాలను స్కూళ్లకు సరఫరా చేసింది. విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది ఏపీ విద్యాశాఖ.

Shireesha

Shireesha

Next Story