ఏపీలో మోగనున్న బడిగంట.. నూతన షెడ్యూల్ విడుదల చేసిన జగన్ సర్కార్

ఏపీలో మోగనున్న బడిగంట.. నూతన షెడ్యూల్ విడుదల చేసిన జగన్ సర్కార్
x

representative image

Highlights

ఏపీలో బడిగంట మోగించేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఏపీలో బడిగంట మోగించేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు. నవంబర్ 2 నుంచి 9, 10 విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. నవంబర్ 23 నుంచి 6,7,8వ తరగతి విద్యార్థులకు, డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తించనున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అన్ లాక్ 5.౦ లో భాగంగా రాష్ట్రాలు స్కూల్స్ తెరిచే విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం సూచించింది. ఇందులో భాగంగా నిజానికి అక్టోబర్ లోనే ఏపీలో బడులు తెరవాలని నిర్ణయించారు. అయితే, వర్షాల కారణంగా తిరిగి వాయిదా పడింది. ఇప్పుడు నవంబర్ ౨ నుంచి పాక్షికంగా అంటే ఒక్క పూట మాత్రమె కొన్ని రోజులు స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించి ఆమేరకు షెడ్యూల్ విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories