రాజధాని కోసం కొత్త బిల్లును సిద్ధం చేసిన ఏపీ సర్కార్.. కొత్త బిల్లులో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ

AP Government Prepares New Bill for Capital
x

రాజధాని కోసం కొత్త బిల్లును సిద్ధం చేసిన ఏపీ సర్కార్..

Highlights

Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితం జరిగిన కేబినెట్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రకటించబోతున్నారు. రాజధానికి సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరోవైపు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నానిని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని అన్నారు.

ఇక రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం కొత్త బిల్లును సిద్ధం చేసిట్లు సమాచారం. కొత్త బిల్లుపై కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త బిల్లులో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories