AP News: ఏపీలో ప్రభుత్వం ద్వారానే ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల అమ్మకం

AP News: సినిమా టికెట్ల పంపిణీని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగింత

Sandeep Eggoju
Updated on: 19 Dec 2021 5:45 PM IST
AP Government Online Movie Ticket Sales on Government Corporation
X

ఏపీలో ప్రభుత్వం ద్వారానే ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల అమ్మకం(ఫైల్-ఫోటో)

AP News: ఆన్‌లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ అంశంలో ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కంపెనీ ద్వారానే ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం జీవో 142ని జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ జీవోని అమల్లోకి తీసుకొస్తునట్లు చెప్పింది.

ఏపీలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న అన్ని ప్రైవేటు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ నోడల్ ఏజెన్సీ బాధ్యత. సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన సవరణలను అనుసరించి సినిమా టికెట్ల అమ్మకాలకు తగిన నమూనాలను, విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఇక IRCTC మాదిరిగా త్వరలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కానుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story