ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు: 28కి చేరిన జిల్లాల సంఖ్య.. రేపటి నుంచే అమలు!

ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు: 28కి చేరిన జిల్లాల సంఖ్య.. రేపటి నుంచే అమలు!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తూ సరికొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తూ సరికొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మార్కాపురం మరియు పోలవరం జిల్లాలను ప్రకటిస్తూ తుది గెజిట్ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రేపటి నుంచే కొత్త జిల్లాల పాలన అమల్లోకి రానుంది.

ముఖ్యమైన మార్పులు ఇవే:

రెండు కొత్త జిల్లాలు: 1. పోలవరం జిల్లా: రంపచోడవరం కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటైంది. 2. మార్కాపురం జిల్లా: మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాయచోటిలో ఉన్న జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. కొత్త జిల్లాలతో పాటు రాష్ట్రంలో అదనంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేశారు. మండలాల సరిహద్దులు, రెవెన్యూ విభాగాల్లోనూ స్వల్ప మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.

రేపటి నుంచే కొత్త పాలన:

ప్రభుత్వ తాజా నిర్ణయంతో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో రేపటి నుంచే అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వికేంద్రీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories