ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ప్రముఖుల పేర్లు

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ప్రముఖుల పేర్లు
x
Highlights

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సర్కార్ కొందరి పేర్లతో జాబితా విడుదల చేసింది. మొత్తం పదకొండు మంది పేర్లలో చంద్రబాబు నాయుడు,...

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సర్కార్ కొందరి పేర్లతో జాబితా విడుదల చేసింది. మొత్తం పదకొండు మంది పేర్లలో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లతో పాటూ, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన రావు పేర్లు తో పాటూ చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరంతా నిబంధనలను తుంగలో తొక్కి వేలాది ఎకరాలు కారుచౌకగా కొన్నట్లు ఆరోపణలున్నాయి.

ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అతి తక్కువ ధరకు ప్రభుత్వం లాండ్ పూలింగ్ పేరుతో సేకరించినట్లు వాటినే టీడీపీ నేతలకు పందేరం చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెల్లరేషన్ కార్డు దారులకు కూడా ఇక్కడ వందలాది ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో ఉందని వారంతా టీడీపీ నేతల బినామీలేనని కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కార్ ఆరోపిస్తోంది. వీరిపైనే ఇప్పుడు విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వీరి కోసం సీఆర్ డీఏ పరిధిని ఇష్టానుసారం మారుస్తూ చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారన్నది కేబినెట్ సబ్ కమిటీ ఆరోపణ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories