Village Volunteer Posts In Andhrapradesh : గ్రామవాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం

Village Volunteer Posts In Andhrapradesh :  గ్రామవాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం
x
Highlights

Village Volunteer Posts In Andhrapradesh : గ్రామ వాలంటీర్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Village Volunteer Posts In Andhrapradesh : గ్రామ వాలంటీర్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు మూడు రోజుల పాటు విధులకు రాకుండా గైర్హాజరైతే వారిని 6వ రోజున తొలగించాలని ఆదేశించింది. వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీతో పాటు వారి హాజరును పై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఆదేశాలుజారీ చేసింది. అంతే కాదు గ్రామ వాలంటీర్లు, వార్డు వలంటీర్ల వ్యవస్థను ప్రతిక్షణం అధికారులు పర్యవేక్షించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థ గాడి తప్పకుండా పటిష్టంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గ్రామ, వార్డు సచివాలయంలో వాలంటీర్లు తప్పనిసరిగా వారంలో మూడు రోజుల పాటు ఫింగర్ ప్రింట్ (బయో మెట్రిక్)ద్వారా అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాలంటీర్ల హాజరులను గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వాలంటీర్లు వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లోతప్పసరిగా వారి హాజరును బయోమెట్రిక్ ద్వారా ఇవ్వాలని తెలిపింది. వారంలో వరుసగా మూడు రోజులపాటు విధులకు హాజరు కాకుండా అదే విధంగా నాలుగు,ఐదో రోజు కూడా విధులకు హాజరుకాకపోతే 6వరోజు వారిని తొలగించాలని స్పష్టం చేసింది.

ఖాళీ ఉన్న పోస్టును 7వ రోజు నోటిఫై చేయాలని ఆదేశించింది. పోస్టు ఖాళీ అయిన రోజు నుంచి 14 రోజుల్లోగా భర్తీ చేయాలని స్ప్టం చేసింది. వాలంటీర్ పోస్టులు ఖాళీ ఉండకుండా ఎప్పటికప్పుడ భర్తీ చేయాలని దీనికోసం సంబంధిత జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఖాళీల భర్తీకి జాయింట్ కలెక్టర్ అనుమతించి మరుక్షణమే ఆ మండలంలోని ఎంపీడీవో, మున్సిపల్, కమిషనర్లు ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని తెలిపింది. పోస్టుల భర్తీకి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం గ్రామ, వార్డు పరిధిలో మెజారిటీ కమ్యూనిటికీ చెందిన వ్యక్తులను రిజర్వేషన్లు పాటిస్తూ భర్తీ చేయాల్సి ఉంది. దీనివల్ల వలంటీర్లు, ఆ పరిధిలోని కుటుంబాల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories