కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

X
Highlights
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీని ఏర్పాటు...
Arun Chilukuri11 Feb 2021 4:21 PM GMT
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలు పూర్తి చేయాలా? వద్దా అనే అంశంపై అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలోని 9 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవేళ భవనాలు పూర్తి చేయనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్, సీఎం ముఖ్య సలహాదారు ఉండనున్నారు.
Web TitleAP Government Formed A committee for Amaravati Buildings
Next Story