Municipal Elections: ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

Arun Chilukuri
Published on: 2 March 2021 5:08 PM IST
Municipal Elections: ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
X

ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులొ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వార్డు వాలంటీర్ల ట్యాబ్‌లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలకు ఇబ్బంది ఏర్పడుతుందని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అయితే వాలంటీర్లపై ఫిర్యాదు వచ్చాయన్న ఎస్ఈసీ తరుపు న్యాయవాది వాటిని పరిశీలించాకే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story