ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదవీ కాలం పొడిగింపు

*మరో 6నెలల పాటు సీఎస్‌గా కొనసాగనున్న సమీర్

Rama Rao
Published on: 14 May 2022 6:31 AM IST
AP Government CS Sameer Sharma Service Extended to Another 6 Months
X

ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదవీ కాలం పొడిగింపు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో మరో 6 నెలల పాటు సమీర్ శర్మ రాష్ట్ర సీఎస్ గా కొనసాగనున్నారు. వాస్తవానికి సమీర్ శర్మ పదవీ కాలంలో నవంబర్ 30, 2021 తోనే ముగియాల్సి ఉంది.

దీని ప్రకారం 31 మే, 2022 న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు, అంటే నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.

Rama Rao

Rama Rao

Next Story