Third Wave: థర్డ్‌వేవ్‌ ముప్పుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

AP Government Alert on the Third Wave
x

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం (ఫైల్ ఇమేజ్)

Highlights

Third Wave: ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వెంటనే టీకా వేయాలని నిర్ణయం

Third Wave: దేశంలో థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్న పిల్లలపై థర్డ్‌వేవ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందని నిపుణుల సూచనతో అలర్ట్‌ అయిన ఏపీ సర్కార్‌.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వెంటనే టీకా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విష‍యమై.. DMHO లకు హెల్త్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ గీతా ప్రసాదిని ఆదేశాలు జారీ చేశారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లుల జాబితా సిద్ధం చేయాలన్న డీహెచ్‌.. అర్హులైన తల్లులందరికీ వ్యాక్సినేషన్‌కు ఒక రోజు ముందు టోకెన్లు పంపిణీ చేయాలని సూచించారు. టోకెన్‌లో సూచించిన తేదీ, సమయానికి తల్లులను కోవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రానికి తీసుకెళ్లి.. వారికి టీకా వేయించే బాధ్యత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు తీసుకోవాలని ఆదేశించారు డీహెచ్‌ గీతా ప్రసాదిని.

Show Full Article
Print Article
Next Story
More Stories