చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సెటైర్లు

Sajjala: ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలో బాబుకు తెలియడంలేదు

Jyothi
Published on: 22 Dec 2022 6:36 PM IST
AP Government Adviser Sajjala Satires On Chandrababu
X

చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సెటైర్లు

Sajjala RamaKrishna Reddy: చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకి ఏ రాష్ట్రంలో రాజకీయం చెయ్యాలో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు ఇల్లే కాదు ఓటుకూడా తెలంగాణలోనే ఉందన్నారు. అయితే ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారో బాబు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సజ్జల. గతంలో కాంగ్రెస్‎తో అంటకాగిన బాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసమే తెలంగాణలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీఎల్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు సలహాలు, సూచనలు ఉన్నాయన్నారు సజ్జల. కాపులకు 5 శాతం రిజర్వేషన్ సాధ్యమైతే చంద్రబాబు ఎందుకు అమలు చెయ్యలేదని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story