AP Formation Day: కృషికి మారు పేరు ఏపీ..ప్రధాని మోడీ

ఆంధ్రప్రదేశ్ ఈరోజు అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటోంది.

K V D Varma
Published on: 1 Nov 2020 12:00 PM IST
AP Formation Day: కృషికి మారు పేరు ఏపీ..ప్రధాని మోడీ
X

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటూ ఆకాంక్షించారు. అందుకోసం అన్ని రకాలా సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

అభివృద్ధిపథంలో ముందుకు సాగాలి: వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భాషా సంస్కృతులను పరిరక్షించుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వటర్‌లో పోస్టు చేశారు.

కృషికి మారు పేరు ఏపీ: మోదీ

ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కృషికి, సహృదయతకు ఆంధ్రప్రదేశ్‌ మారుపేరని అన్నారు. ఆంధ్రులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నానన్నారు.

ఏపీ కృషి ప్రశంసనీయం: అమిత్‌షా

నవంబరు 1 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి ఏపీ చేసిన అపార కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర శ్రేయస్సు కోసం కేంద్రం అంకితభావంతో పని చేస్తోందని అన్నారు.

అభివృద్ధి కొనసాగాలి: నడ్డా

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతి నిర్మాణంలో ఏపీ తన వంతు పాత్రపోషిస్తోందని చెప్పారు. భవిష్యత్‌లోనూ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని నడ్డా ఆకాంక్షించారు.





K V D Varma

K V D Varma

Next Story