భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం: బుగ్గన

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం: బుగ్గన
x
Highlights

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు కమర్షియల్...

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉందని హర్దీప్‌‌కు మంత్రి బుగ్గన వివరించారు. త్వరలోనే ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని వెల్లడించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన షిప్టింగ్‌, టెక్నికల్ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు బుగ్గన తెలిపారు. తాము చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారనట్టు బుగ్గన వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది. సివిల్ ఏవియేషన్‌కు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. బోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కూడా త్వరలోనే జరుగుతుంది అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories