ఏపీ దేవాదాయశాఖ మంత్రికి కరోనా !

ఏపీ దేవాదాయశాఖ మంత్రికి కరోనా !
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇటీవల ఏపీలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇటీవల ఏపీలో ఎంపీలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాల అనంతరం వెల్లంపల్లికి స్వల్ఫ లక్షణాలు కనిపించగా కరోనా పరీక్ష చేయించుకున్నట్లు చెబుతున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్ కు పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి జరిపించారు. వివాదాల నేపధ్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం పాటు తిరుమలలోనే మకాం వేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు తిరుమలలోనే ఉన్నమంత్రి ఈ నెల 25వ తేదీన విజయవాడ చేరుకున్నారు. వారం పాటు బయట ఉండి రావడంతో ముందు జాగ్రత్తగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోగా స్వల్పంగా కోవిడ్ లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories