AP Employees JAC: నేడు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీల అత్యవసర భేటీ

AP Employees JAC: ఉద్యమ కార్యాచరణను కొనసాగించేందుకు సిద్ధమవుతున్న జేఏసీ...

Shireesha
Published on: 3 Jan 2022 11:20 AM IST
AP Employees JAC Emergency Meeting on PRC | AP Latest News
X

AP Employees JAC: నేడు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీల అత్యవసర భేటీ

AP Employees JAC: ఇవాళ ఉద్యోగ సంఘాల జేఏసీల అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని ఎన్జీవో భవన్‌లో ఇరు జేఏసీల రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించారు.

వాయిదా వేసిన ఉద్యమ కార్యాచరణను కొనసాగించేందుకు జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం చేస్తున్న తాత్సారం, ప్రకటనలపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ఈ నెల నుంచి ఆందోళన చేపట్టబోతున్నట్లు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకటించారు.

Shireesha

Shireesha

Next Story