AP Elections: మరో కీలక నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ

AP Elections:ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లపై మరోసారి రివ్యూ * బలవంతపు ఉపసంహరణలపై ఎస్‌ఈసీ ఆరా

Sandeep Eggoju
Published on: 18 Feb 2021 5:00 PM IST
AP Elections SEC Nimmagadda Ramesh Kumar Taken Key Decision
X
ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ (ఫైల్ ఇమేజ్)

AP Elections: ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌‌కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగిన చోట నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఎస్‌ఈసీ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లపై మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. బలవంతపు ఉపసంహరణలు, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఘటనలపై దృష్టిపెట్టిన నిమ్మగడ్డ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

బాధిత అభ్యర్ధులు ఎవరైనాసరే ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చని ఎస్‌ఈసీ సూచించారు. ఆర్వో లేదా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వొచ్చన్నారు. అలాగే, మీడియాలో వచ్చిన కథనాలను రుజువుగా తీసుకుంటామని తెలిపారు. ఇక, బలవంతపు ఉపసంహరణలు, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఘటనలపై ఫిబ్రవరి 20లోపు రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించిన ఎస్‌ఈ‌సీ నివేదిక తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story