ఏపీ కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌.. కనగరాజ్ ఫుల్ ప్రొఫైల్ ఇదీ..

ఏపీ కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌.. కనగరాజ్ ఫుల్ ప్రొఫైల్ ఇదీ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ కనగరాజును ఎంపిక చేస్తూ...

ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ కనగరాజును ఎంపిక చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో మధ్యంతరంగా రమేష్ కుమార్ పై వేటు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ బిశ్వభూషన్ ఓకే చెప్పారు..

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ కనగరాజ్ నియమితులయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ విషయం తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామాకానికి సంబంధించిన సెక్షన్ 200ని పూర్తిగా మార్చేస్తూ శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో ఆయన పదవీకాలం ముగిసినట్టయింది.

కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్ పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదించడంతో శనివారం ఆయన ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ సర్కార్. ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు.

ఎస్‌ఈసీ జస్టిస్ కనగరాజు 1972లో మద్రాస్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు. 1973లో సేలం బార్ అసోసియేషన్ సభ్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. మద్రాస్ హైకోర్టు జడ్జీగా 9ఏళ్ల పాటు పనిచేశారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలపై కీలక తీర్పులు చేశారు. మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్‌లోనూ ఆయనకు పని చేసిన అనుభవం ఉంది.

2006లో హైకోర్టు జడ్జీగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా మూడేళ్ల పాటు సేవలందిచనున్నారు జస్టిస్ కనగరాజ్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories