టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి సురేష్ ఫైర్

X
Highlights
నివర్ తుఫాన్ పంట నష్టం, అంచనాలు, పెట్టుబడి రాయితీలు ప్రకటించిన తర్వాత నారా లోకేష్ ఏ ఉద్దేశంతో...
Arun Chilukuri29 Dec 2020 1:55 PM GMT
నివర్ తుఫాన్ పంట నష్టం, అంచనాలు, పెట్టుబడి రాయితీలు ప్రకటించిన తర్వాత నారా లోకేష్ ఏ ఉద్దేశంతో పర్యటిస్తున్నారని ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. రాజకీయం చేయడం తప్పా లోకేష్ పర్యటన వల్ల ఏ ప్రయోజనం లేదని ఎద్దెవా చేశారు. వర్షం కారణంగా రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాలను సైతం కొనుగోలు చేస్తున్నామని మంత్రి స్పష‌్టం చేశారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు పంట నష్టంపై అంచనాలు తయారు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడే లోకేష్ పర్యటన చేస్తున్నారని మంత్రి సురేష్ ఆరోపించారు.
Web TitleAP Education minister Adimulapu Suresh Comments on Nara Lokesh
Next Story