Goutam Sawang: గుజరాత్‌ హెరాయిన్‌తో ఏపీకి సంబంధంలేదు

Goutam Sawang: కొన్ని రాజకీయ పార్టీలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయి : డీజీపీ

Sandeep Eggoju
Updated on: 12 Oct 2021 8:36 PM IST
AP DGP Goutam Sawang Said the AP had Nothing to do With Heroin
X

డీజీపీ గౌతమ్ సావాంగ్ (ఫైల్ ఇమేజ్)

Goutam Sawang: ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి ఎలాంటి సంబంధంలేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలో అంతటా ఆరా తీశామని ఎలాంటి లింకులు లేవని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఏపీ పరువును తీస్తున్నాయని డీజీపీ ఆరోపించారు. ప్రజల్లో, యువకుల్లో లేని అపోహలు సృష్టించకూడదన్నారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో ఏపీ ఆక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి పెర్ఫార్మన్స్ సాధించాయని డీజీపీ అభినందించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story