AP DGP on Ammonium Nitrate stockpiles: అమ్మోనియం నైట్రేట్ తో ఏపీకి ముప్పు లేదు: ఏపీ డిజిపి

AP DGP on Ammonium Nitrate stockpiles: లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచదేశాలను కలచివేసింది. వరుసగా రెండు సార్లు భారీ పేలుళ్లు జరగడంతో రాజధాని నగరం మూడువంతులకుపైగా నాశనమైపోయిన దృశ్యాలు నిర్ఘాంతపరిచాయి.
AP DGP on Ammonium Nitrate stockpiles: లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచదేశాలను కలచివేసింది. వరుసగా రెండు సార్లు భారీ పేలుళ్లు జరగడంతో రాజధాని నగరం నాశనమైపోయిన దృశ్యాలు నిర్ఘాంతపరిచాయి. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. శుక్రవారం మంగళగిరి లోని పోలీసు కేంద్ర కార్యాలయం నుండి జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో గౌతమ్ సవాంగ్ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. బీరూట్ లోని అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో పోలీస్ శాఖ అప్రమత్తమైందని పేర్కొన్నారు.
అమ్మోనియం నైట్రేట్ వినియోగం పై ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని కంపెనీలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని గౌతం సవాంగ్ సూచించారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వినియోగం, జాతీయ ,అంతర్జాతీయ రవాణా, ఓడరేవుల వద్ద నిల్వలు, విక్రయాలపైన 2012 లో రూపొందించిన నిబంధనలను జిల్లాల ఎస్పీ లకు వివరించారు.
• అదనంగా రవాణాకు అనుమతి లేదు.
• లైసెన్సు లేకుండా ఎక్కడ కూడా తయారీకి అనుమతి లేదు.
• 18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులగా నియమించకూడదు.
• అనుమతులేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్ లకు ఉపయోగించరాదు.
• అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
• నిబంధనలకు లోబడి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించాలి
• పూర్తి స్థాయిలో అన్ని అమ్మోనియం నైట్రేట్ 2012 నియమ, నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి
• రాష్ట్రంలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, పేలుడు పదార్థాల రవాణా, వినియోగం, అమ్మకాలు, కొనుగోళ్లు, నిల్వ కేంద్రాలు మొదలైన వాటిపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఎస్పీలను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏడిజి ఎల్ & ఓ శ్రీ.రవిశంకర్ అయ్యన్నార్ ఏపీఎస్ , ఇంటలిజెన్స్ ఐ.జీ మనిష్ కుమార్ IPS, డీఐజీ. ఎల్ అండ్ ఓ.ఎస్వి రాజశేఖర్ బాబు ఏపీఎస్ తోపాటు లీగల్ అడ్వైజర్ తదితరులు పాల్గొన్నారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్‌కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT