మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు : పుష్ప శ్రీవాణి

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు : పుష్ప శ్రీవాణి
x
Highlights

పవన్ కళ్యాణ్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు....

పవన్ కళ్యాణ్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఆడ పిల్లల ప్రాణం, మానం అంటే పవన్‌కి ఇంత చిన్న చూపా అని ప్రశ్నించారు. దిశ నిందితులను అందరూ కఠినమైన శిక్ష విధించాలంటుంటే పవన్ వారిని బెత్తంతో కొట్ట వదిలేయంటున్నారన్నారు.

దిశా ఘటన తరువాత యావత్ దేశం ఒక్కటై హత్యాచారం చేసిన వాళ్లకు కఠినమైన శిక్షలు పడాలని నినదిస్తున్నారని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రేప్ చేసిన వారిని బెత్తంతో కొట్టి వదిలేయమంటారా...? ఓ బాధ్యతగల రాజకీయ పార్టీ అధ్యక్షుడు మహిళలంటే ఇంత చులకన భావంతో మాట్లాడటం సహించరాని విషయమని దుయ్యబట్టారు. తక్షణం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories