కుంకీ ఏనుగులు ఇవ్వండి.. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన పవన్‌

Pawan Kalyan: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన పవన్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 Aug 2024 2:52 PM IST
AP Deputy CM Pawan visit to Bengaluru
X

Pawan Kalyan: బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

Pawan Kalyan: బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు సీఎం సిద్ద. అనంతరం.. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ బి.ఖంద్రేతో భేటీ అయ్యారు పవన్‌. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలా.. ఇరురాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణపై చర్చిస్తున్నారు.

అలాగే.. ఏపీలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్న అంశాలను ఈశ్వర్‌కు పవన్‌ వివరించనున్నారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల సంచారంతో పంటలు నాశనమవుతున్నాయని, అలాగే.. ప్రాణనష్టం కూడా సంభవిస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏనుగులను అదుపులో పెట్టేందుకు కుంకీ ఏనుగుల అవసరం ఉందని, కర్ణాటక కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు పవన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story