Narayana Swamy: నాపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

* చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్‌ * నిజాయితీ నిరూపించడానికి కాణిపాకంలో ప్రమాణం చేస్తా

Sandeep Reddy
Updated on: 27 Aug 2021 4:29 PM IST
AP Deputy CM Narayana Swamy Challenges To Chandrababu I am Ready to Resign if Allegations of corruption Against me
X

నారాయణ స్వామి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Narayana Swamy: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుకు సవాల్ విసిరారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ లో ఫర్నీచర్ పై కూడా ఆరోపణలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు నిజాయితీగా పనిచేశానని చెప్పుకొచ్చిన నారాయణస్వామి కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని చంద్రబాబు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story