AP CS: తెలంగాణ తరహాలో డీఏ ఇచ్చి ఐఆర్ ఇవ్వకుంటే రూ.10 వేల కోట్లు మిగిలేవి..

Sameer Sharma: ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ.

Arun Chilukuri
Published on: 3 Feb 2022 8:27 PM IST
AP CS Sameer Sharma Press Meet
X

AP CS: తెలంగాణ తరహాలో డీఏ ఇచ్చి ఐఆర్ ఇవ్వకుంటే రూ.10 వేల కోట్లు మిగిలేవి..

Sameer Sharma: ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ. ధర్నాలు, ఆందోళనలతో జరిగేది ఏం ఉండదన్నారు. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ లాంటిదన్న సీఎస్.. దాన్ని సర్దుబాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ తరహాలో డీఏ ఇచ్చి ఐఆర్ ఇవ్వకుంటే 10వేల కోట్లు మిగిలేవని చెప్పారు. తెలంగాణలా తాము డీఏ ఇవ్వలేదని, ఐఆర్‌ ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పటికైనా సమ్మె నోటీసును విరమించుకుని చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. ఉద్యోగులకు సమస్యలు ఉంటే మంత్రుల కమిటీ ఉందని, ఏదైనా రిపోర్ట్ తయారు చేసి పరిష్కారం ఆలోచిద్దామని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story