సీఎస్‌ సమీర్‌ శర్మ అధ్యక్షతన.. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ సమావేశం

Andhra Pradesh: హాజరైన 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 9:50 PM IST
AP CS Sameer Sharma Chaired Civil Services Joint Council Meeting
X

సమీర్ శర్మ అద్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ కౌన్సిల్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల‌ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ భేటీ సుమారు మూడున్నర గంటలకు పైగా కొనసాగింది. కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోకపోగా తూతూ మంత్రంగా సమావేశం జరిగిందని ఆయా ఉద్యోగాల సంఘాల నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story