AP News: సెలవుపై వెళ్తోన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి.. సాయంత్రంలోపు కొత్త సీఎస్‌?

AP News: GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌ను లీవ్ కోరిన సీఎస్‌

Shashank Gullapelli
Published on: 6 Jun 2024 2:18 PM IST
AP CS Jawahar Reddy Goes on leave New CS by Evening Likely
X

AP News: సెలవుపై వెళ్తోన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి.. సాయంత్రంలోపు కొత్త సీఎస్‌?

AP News: ఏపీలో ఎన్నికల అనంతరం ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ్టి సాయంత్రానికి రాష్ట్రంలో కొత్త చీఫ్ సెక్రటరీని నియమించనున్నట్టు సమాచారం. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి... అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టు తెలిపారు. GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌ను ఇప్పటికే లీవ్ కోరారు సీఎస్‌. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లగానే గవర్నర్ కొత్త సీఎస్‌ను నియమించే అవకాశాలున్నాయి. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story