వింతవ్యాధిపై జగన్ వెంటనే స్పందించారు: సీఎస్

X
వింతవ్యాధిపై జగన్ వెంటనే స్పందించారు: సీఎస్
Highlights
దెందులూరు మండలం కొమిరేపల్లి తదితర పరిసరాల్లో విజృంభిస్తు్న్న వింత వ్యాధికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. వ్యాధి ...
Arun Chilukuri22 Jan 2021 11:10 AM GMT
దెందులూరు మండలం కొమిరేపల్లి తదితర పరిసరాల్లో విజృంభిస్తు్న్న వింత వ్యాధికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. వ్యాధి ఎందుకు ప్రబలుతోందన్న అంశం పరిశీలించడానికి సీఎం జగన్ ఆదేశాల మేరకు సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఆ గ్రామాల్లో పర్యటించారు. వింతవ్యాధిపై సీఎం జగన్ వెంటనే స్పందించారని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. స్థానికాధికారులతో సమీక్ష జరిపారు. మెడికల్ క్యాంపుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Web Titleap cs adityanath inspect Komirepalle village
Next Story