AP Corona Cases: ఏపీలో కొత్తగా 23,160 కరోనా కేసులు, 106 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 19 May 2021 6:52 PM IST
AP Corona Cases: 23,160 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 19th MAY 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 23,160 కరోనా కేసులు, 106 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 23,160 పాజిటివ్ కేసులు నమోదు కాగా 106 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 17మంది కొవిడ్‌తో మృతిచెందగా.. విశాఖ, నెల్లూరులో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మృత్యువాతపడ్డారు. గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,82,41,637శాంపిల్స్‌ పరీక్షించగా.. 14,98,532మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 12,79,110మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 9686 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,736 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story