AP Corona Cases: ఏపీలో కొత్తగా 20,345 కరోనా కేసులు, 108 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 11 May 2021 5:17 PM IST
AP Corona Cases: 20,345 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 10th MAY 2021
X

కరోనా(ఫైల్ ఇమేజ్ )


AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,345 పాజిటివ్ కేసులు నమోదు కాగా 108 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది, విశాఖపట్నంలో 12, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున, ప్రకాశంలో 9, నెల్లూరు 8, కృష్ణా 7, శ్రీకాకుళం 6, అనంతపురం, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మరణించారు.

ఏపీలో గడిచిన 24గంటల్లో 86,878 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 20,345 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు 13,22,934 మంది కరోనా భారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 8,899కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 14,502 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,75,14,937 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,102 యాక్టివ్‌ కేసులున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story