సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని సీఎం..రాష్ట్రాన్ని పాలిస్తారా? చింతా మోహన్

Tirupati By Poll: ఆరునెలల తర్వాత జగన్‌ సీఎంగా ఉండరని, ఉండలేరని జోస్యం చెప్పారు మాజీమంత్రి చింతా మోహన్‌.

Samba Siva Rao
Published on: 4 April 2021 4:26 PM IST
Chinta mohan
X

చింతా మోహన్ ఫైల్ ఫోటో 

Tirupati By Poll: ఆరునెలల తర్వాత జగన్‌ సీఎంగా ఉండరని, ఉండలేరని జోస్యం చెప్పారు తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌. ధర్మయుద్ధంలో జగన్‌ గెలవలేరని ఆయన అన్నారు. జగన్‌పై కోపాన్ని చెల్లి షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారన్నారు. వివేకా కుమార్తె ప్రశ్నలకు సీఎం జగన్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

సొంత అక్కా చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి.. సీఎంగా ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు పట్టిన గతే.. ఈసారి బీజేపీకి పట్టనుందని చెప్పారు చింతా మోహన్‌. దానికి కారణం నిత్యావసరాల ధరలు భారీగా పెంచేయడమేనని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు చింతా మోహన్‌.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story