ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 11:55 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
X

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వే ద్వారా కుటుంబాలు, పౌరుల వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోనున్నారు.

ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సేకరించిన డేటాను ఆర్‌టీజీఎస్ డేటా లేక్‌లో భద్రపరిచి, భవిష్యత్ విధాన నిర్ణయాలకు వినియోగించనున్నారు. సర్వే నిర్వహణ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేపడతారు. జిల్లా కలెక్టర్లు, ప్లానింగ్, ఆర్టీజీఎస్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story