పోలవరంలో కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ పర్యటన

*ఇందుకూరుపేటలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి

Rama Rao
Updated on: 4 March 2022 12:47 PM IST
AP CM YS Jagan Visiting Polavaram Project with Union Minister Gajendra Singh Shekavath
X

పోలవరంలో కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ పర్యటన

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలోని ఇందుకూరు పేట-1 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్, ఏపీ సీఎం జగన్ పరిశీలించారు. నిర్వాసితులతో షెకావత్, జగన్ మాట్లాడారు. పోలవరం నిర్వాసితులు తమ సమస్యలను వివరించారు. ఇక పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన సైకర్యాలు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత తాను మరోసారి ఇక్కడికి వస్తానని షెకావత్ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక జీవనాడి అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మరింత వేగంగా చేయాలని ఏపీ సీఎం జగన్ కోరారు. ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస పనులపై కూడా అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story