YS Jagan - Visakha Tour: ఇవాళ విశాఖకు సీఎం జగన్.. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు...

YS Jagan - Visakha Tour: విశాఖలో హర్యానా సీఎంతో జగన్ భేటీ...

Shireesha
Updated on: 19 April 2022 8:09 AM IST
AP CM YS Jagan Visakhapatnam Tour Today 19 04 2022 and Meeting with Haryana CM | Live News
X

YS Jagan - Visakha Tour: ఇవాళ విశాఖకు సీఎం జగన్.. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు...

YS Jagan - Visakha Tour: ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇప్పటికే విశాఖ పర్యటనలో ఉన్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో జగన్ సమావేశం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11:05 గంటలకు విశాఖకు చేరుకుంటారు.

అక్కడి నుంచి 11:50 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు చేరుకుంటారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. సీఎం జగన్ రానున్న నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు.

నగరంలో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రముఖుల పర్యటన ఉందని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ మీదుగా తాటిచెట్లపాలెం, 28 బస్ స్టాప్, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, సిరిపురం, సీఆర్ రెడ్డి సర్కిల్, ప్రేమ సమాజం రోడ్ గుండా ప్రయాణించే సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Shireesha

Shireesha

Next Story