వైసీపీలో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు ఎవరు..? ఈ సారి వారికే టిక్కెట్లు..!

AP News: 40 శాతం గ్రాఫ్ ఎమ్మెల్యేలది అని చెప్పిన జగన్...

Shireesha
Published on: 29 April 2022 10:57 AM IST
AP CM YS Jagan Survey on MLS Work for Upcoming Elections 2024 | AP Live News
X

వైసీపీలో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు ఎవరు..? ఈ సారి వారికే టిక్కెట్లు..!

AP News: ఏపీలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలను వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రతీష్టాత్మకంగా తీసుకున్నారు. 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలంగా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పటినుంచే ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే చేయిస్తున్నారు. సర్వే రిపోర్ట్‌లు ఆధారంగానే టిక్కెట్లు ఉంటాయని చెప్తున్నారు. మొన్నటి సమావేశంలో సీఎంగా తనది 60 శాతం, ఎమ్మెల్యేలది 40 శాతం గ్రాఫ్ అని చెప్పారు.

సర్వేల్లో కొంతమంది గ్రాఫ్ తగ్గడంతో తమ తమ తప్పులు సరిదిద్దుకోవాలని, నియోజకవర్గాల్లో పరపతి పెంచుకోవాలని సూచించారు. ఇక ఎన్నికలలోపు మూడు సర్వేలను జగన్ చేయించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు గెలిచే వారికి టిక్కెట్లు ఇవ్వనున్నారు. పీకే టీం లేదు అని వైసీపీ అధిష్టానం చెబుతున్నా.. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఐప్యాక్ ద్వారా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story