Top
logo

వచ్చే ఏడాదిలో గ్రామాల స్వరూపమే మారనుంది : సీఎం జగన్

వచ్చే ఏడాదిలో గ్రామాల స్వరూపమే మారనుంది : సీఎం జగన్
X
Highlights

వచ్చే ఏడాదికల్లా గ్రామాల స్వరూపమే మారనుందని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి గ్రామంలో గోధాములు, కోల్డు...

వచ్చే ఏడాదికల్లా గ్రామాల స్వరూపమే మారనుందని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి గ్రామంలో గోధాములు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంతో పాటు గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్, ప్రీప్రైమరీ స్కూల్, జనతాబజార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జనవరి 31 నాటికల్లా భూముల గుర్తింపు పూర్తికావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం 10వేల 2వందల 35 కోట్ల రూపాయాల ఆర్థిక సమీకరణలను కూడా పూర్తి చేసినట్లు సీఎం జగన్ వివరించారు.

ఫిబ్రవరి చివరి నాటికల్లా నాడు – నేడు పనులను పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్కూళ్ల భవనాల డెవలప్‌మెంట్‌ పనులపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రొక్యూర్‌ మెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యూకేషన్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ క్యాంపు ఆఫీస్‌ నుంచి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రతీ గ్రామ సచివాలయంలో విలేజ్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు తమ విధులపై శ్రద్ధచూపాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తిస్తాయిలో వేగవంతం చేయాలన్నారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని సీఎం సూచించారు. మల్టీపుల్‌ బిల్డింగ్స్ పనులను ఒకే ఏజెన్సీకి అప్పగించడం వల్ల పనుల్లో ఆలస్యమవుతుందన్నారు. ఇలాంటి జరుగకుండా చూసుకోవాలని సూచించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా ఎంపిక చేసి నిర్మాణాల ప్రగతిని సమీక్షించాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు.

Web TitleAP CM YS Jagan reviews on Spandana program
Next Story