YS Jagan: కాసేపట్లో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా 7500 పైగా అభ్యంతరాలు, సలహాల స్వీకరణ...

Shireesha
Published on: 3 March 2022 10:32 AM IST
AP CM YS Jagan Review Meeting on Redistribution of Districts | AP Live News
X

YS Jagan: కాసేపట్లో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan: కాసేపట్లో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలకు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల 500లకు పైగా అభ్యంతరాలు, సలహాలను స్వీకరించారు. సుమారు 60 అంశాలపై సూచనలు, సలహాలు స్వీకరించినట్లు తెలుస్తోంది.

ఇవాళ్టి సమావేశంలో సీఎం జగన్‌కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. సహేతుకమైన కారణాలుంటే పరిశీలిస్తామని గతంలోనే చెప్పిన సీఎం జగన్.. కొత్త జిల్లాలకు కార్యాయాలు, ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story