YS Jagan - Odisha Tour: ఈ నెల 9న సీఎం జగన్ ఒరిస్సా టూర్.. నీటి సమస్యపై చర్చ

YS Jagan - Odisha Tour: ఒరిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటి కానున్న సీఎం జగన్...

Shireesha
Updated on: 4 Nov 2021 12:00 PM IST
AP CM YS Jagan Odisha Tour to Discuss about Water Problem | AP Latest News
X

YS Jagan - Odisha Tour: ఈ నెల 9న సీఎం జగన్ ఒరిస్సా టూర్.. నీటి సమస్యపై చర్చ

YS Jagan - Odisha Tour: సీఎం జగన్ ఈ నెల 9న ఒడిశా పర్యటనకు వెళ్లనున్నారు. భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటి కానున్నారు. ఏపీ, ఒడిషా రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ, ఒడిశా మధ్య వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజీ అంశంపై చర్చించే అవకాశముంది.

ఒడిశాలోని కలహందిలో పుట్టే వంశధార నది అక్కడి నుంచి మన రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలోకి ప్రవహిస్తోంది. దీంతో వంశధార నదికి సంబంధించి ఏపీ, ఒడిశా మధ్య వివాదాలు ఉన్నాయి.

Shireesha

Shireesha

Next Story