YS Jagan - Nandyala Tour: కొత్త జిల్లా నంద్యాల ప‌ర్యటనకు జ‌గ‌న్‌.. భారీ బందోబస్తు...

YS Jagan - Nandyala Tour: ఎస్పీజీ మైదానంలో బ‌హిరంగ స‌భ ఏర్పాటు...

Shireesha
Updated on: 8 April 2022 9:15 AM IST
AP CM YS Jagan Nandyala Tour Today 08 04 2022 | AP Live News
X

YS Jagan - Nandyala Tour: కొత్త జిల్లా నంద్యాల ప‌ర్యటనకు జ‌గ‌న్‌.. భారీ బందోబస్తు...

YS Jagan - Nandyala Tour: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ కొత్త జిల్లాగా ఏర్పడిన నంద్యాల జిల్లా ప‌ర్యట‌న‌కు వెళుతున్నారు. నంద్యాల ప‌ట్టణంలోని ఎస్పీజీ మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ వేదిక మీద నుంచి జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంత‌రం అక్కడే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్రజ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జగన్ టూర్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

విజయవాడ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11.10 గంటలకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి 11.35గంటలకు బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కు తిరుగు ప్రయాణమవుతారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్తారు. సీఎం జగన్ నంద్యాలకు రానున్న నేపథ్యంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Shireesha

Shireesha

Next Story