Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్.

Shekhar G
Updated on: 14 Dec 2023 12:45 PM IST
Ap Cm Ys Jagan Mohan Reddy To Tour Today In Srikakulam Palasa
X

Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటనలో డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ప్రారంభించనున్నారు. . అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 74.24 కోట్లు వెచ్చించింది. 200 పడకల ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ మరియు ఇతర వైద్య సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఈ ప్రాంతంలోని దాదాపు 700 గ్రామాలలో ప్రబలంగా ఉన్న.. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై పరిశోధనకు మద్దతు ఇస్తుందని తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story