YS Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా?

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Samba Siva Rao
Published on: 6 Jun 2021 6:30 PM IST
Ys jagan Delhi Tour Canceled
X

జగన్ ఫైల్ ఫోటో  

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రుల తీరిక లేని షెడ్యూల్ కార‌ణంగా జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని భావించిన సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే సీఎం జగన్ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వ్యాక్సిన్ల అంశంపై సీఎం జగన్ దేశంలోని ముఖ్యమంత్రులందరినీ కూడగట్టే ప్రయత్నం చేశారు. వ్యాక్సిన్లపై సీఎంలు ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి పనులు, విభజన హామీలపైనా కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని ప్ర‌చారం సాగుతుంది. ఈ నేపథ్యంలో, వ్యాక్సినేషన్ పై తన వాణీని కేంద్రానికి వినిపించాలని సీఎం జగన్ భావించారని తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story