logo
ఆంధ్రప్రదేశ్

బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు...

AP CM YS Jagan Condolence to Bus Accident Victims and announced 2 Lakhs Ex gratia | Live News
X

బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు...

Highlights

YS Jagan: గాయపడ్డ వారికి రూ. 50 వేలు, మెరుగైన వైద్య సేవలకు ఆదేశం...

YS Jagan: బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను సీఎంకు వివరించారు అధికారులు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు అధికారులు వివరించారు.

తిరుపతిలో స్థానిక ఆస్పత్రులు స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇక ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున సహాయం అందించాలని, అలాగే గాయపడ్డవారికి 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు సీఎం జగన్. అంతేకాకుండా క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలన్నారు.

Web TitleAP CM YS Jagan Condolence to Bus Accident Victims and announced 2 Lakhs Ex gratia | Live News
Next Story