జగన్-అమిత్ షా భేటీ.. చర్చకు వచ్చిన అంశాలివే

జగన్-అమిత్ షా భేటీ.. చర్చకు వచ్చిన అంశాలివే
x
Highlights

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇందులో రెండుసార్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు..

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇందులో రెండుసార్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు జగన్. అలాగే కేంద్ర జల్‌శక్తి మంత్రితోను భేటీ అయ్యారు.. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై చర్చించారు.

ముఖ్యంగా ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు షా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా పలు అంశాలతో 18 పేజీల లేఖను అమిత్ షా కు అందించారు. ఇందులో 14వ ఆర్థికసంఘం పెండింగ్‌ నిధులు రూ.2254.52 కోట్లు విడుదల చేయాలని.. అలాగే రాష్ట్రానికి రూ.3,622.07 కోట్ల జీఎస్టీ బకాయిలు, 2014 కు ముందు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.4006.43 కోట్లు, అలాగే పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి వంటి నిధులను త్వరితగతిన విడుదల చేయాలనీ వినతిపత్రంలో ప్రస్తావించారు.

2014–15కు గాను రూ.4,117.89 కోట్లుద్రవ్య లోటుగా గుర్తించి, రూ.3,979.50 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అయితే మిగిలిన రూ.138.39 కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి 2013–14 నుంచి 2016–17 వరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సబ్సిడీ రూ.1,600 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖను ఆదేశించాలని కూడా జగన్ పేర్కొన్నారు. ఇక కీలకమైన కొత్త రాజధాని కోసం రూ.49,924 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు మాత్రమే ప్రకటించి, రూ.1,500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని లేఖలో జగన్ ప్రస్తావించారు.

మరోవైపు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(డీపీఆర్‌)ను సమర్పించారు. ఏడు జిల్లాలకు ఆరేళ్లపాటు ఏటా రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.2,100 కోట్లు ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు రూ.1,400 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగిలిన రూ.700 కోట్లు వీలైనంత త్వరగా ఇవ్వాలని జగన్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories