Ugadi 2023: సీఎం జగన్‌ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు

Ugadi 2023: తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా కొనసాగాయి.

Arun Chilukuri
Published on: 22 March 2023 11:35 AM IST
AP CM Jagan Wishes People on the Ocassion of Ugadi
X

Ugadi 2023: సీఎం జగన్‌ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు

Ugadi 2023: తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా కొనసాగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరిగాయి. ఉగాది వేడుకల్లో భాగంగా నూతన పంచాగాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్‌ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ''రైతులకు మేలు జరగాలి. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని సీఎం జగన్‌ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story