CM Jagan: నేటి నుంచి ఏపీ సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు

CM Jagan: రోజుకు 3 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్‌

Shashank Gullapelli
Published on: 28 April 2024 12:10 PM IST
AP CM Jagan Whirlwind Tours From Today
X

CM Jagan: నేటి నుంచి ఏపీ సీఎం జగన్ సుడిగాలి పర్యటనలు

CM Jagan: ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచారు ఏపీ సీఎం జగన్. మరోసారి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర మంతటా బస్సుయాత్రను పూర్తి చేసిన జగన్.. నేటి నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోజుకు మూడు బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసింది వైసీపీ. తాడిపత్రి నుంచి ప్రచార భేరి ప్రారంభించనున్న జగన్‌... మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.

ఇక 29న ఉదయం చోడవరం, మధ్యాహ్నం పి.గన్నవరం, సాయంత్రం పొన్నూరులో నిర్వహించే సభలకు హాజరవుతారు. 30న ఉదయం కొండేపి, మధ్యాహ్నం మైదుకూరు, సాయంత్రం పీలేరు సభల్లో ప్రసంగిస్తారు. మే 1న ఉదయం బొబ్బిలి, మధ్యాహ్నం పాయకరావుపేట, సాయంత్రం ఏలూరు సభలకు హాజరవుతారు. జగన్ సభలకు సంబంధించి అన్నిచోట్ల శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు గత మానిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలు చేసినవి ప్రజలకు వివరించి... కొత్త హామీలను ప్రజల ముందు ఉంచనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story