CM Jagan: గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన

CM Jagan: టీడీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు

Shashank Gullapelli
Published on: 13 April 2024 1:49 PM IST
AP CM Jagan Visit To Guntur District
X

CM Jagan: గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన

CM Jagan: చేనేత రంగాన్ని ఏనాడు పట్టించుకోని చంద్రబాబు రంగులు మార్చిన మేనిఫెస్టోతో మళ్లీ వస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. చేనేతల బతుకులు మార్చే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలన్నారు. చేనేత రంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ పాలనకు-వైసీపీ పాలనకు తేడాను గమనించాలన్నారు. 2014లో మేనిఫెస్టోలో చేనేతలకు రెండు పేజీల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు మల్లీ ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానంటున్నాడు.. హామీలు ఇచ్చి గాలికి వదిలేసే నేతలు కావాలో..అభివృద్ధి చేసే పాలకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story