ఏపీలో మరో పథకానికి శ్రీకారం చుట్టనున్న సర్కార్

X
Highlights
డిసెంబర్ 25న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పండుగ వాతావరణంలో పేదలకు ఇళ్ల...
Arun Chilukuri19 Dec 2020 6:42 AM GMT
డిసెంబర్ 25న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పండుగ వాతావరణంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, చర్యలు చేపట్టింది. మరోవైపు మొత్తం 3 ప్రాంతాల్లో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నెల 25న కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 లక్షల మంది లబ్దిదారులకు ఒకేసారి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.
Web TitleAP CM Jagan to launch house site pattas distribution on December 25
Next Story